Saturday, July 27, 2024
Homeతెలంగాణమృతురాలి కుటుంబానికి తపాలా ప్రమాద భీమా అండ

మృతురాలి కుటుంబానికి తపాలా ప్రమాద భీమా అండ

మృతురాలి కుటుంబానికి తపాలా ప్రమాద భీమా అండ

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్

మంథని జూలై 15( కలం శ్రీ న్యూస్ ): మృతురాలి జీవితానికి తపాలా శాఖ వారి ప్రమాద బీమా అండగా నిలిచింది. ఖానాపూర్ గ్రామానికి చెందిన రాపాక సౌజన్య పని నిమిత్తం బట్టు పల్లి నుండి తిరిగి వస్తుండగా లారీ కింద పడి మరణించారు.మృతురాలు సౌజన్య పోస్టు ఆఫీసులో సంవత్సరానికి కేవలం 399 రూపాయల తో ప్రమాద జీవిత భీమా పథకాన్ని తీసుకోవడంతో ఆమె కుటుంబానికి భీమా కింద 10 లక్షలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన చెక్కును శుక్రవారం మంథని పోస్ట్ ఆఫీసు ఆవరణలో సౌజన్యకి నివాళులు అరిపించి,వారి కుటుంబ సభ్యులకు పోస్టల్ సూపరింటెం డెంట్ పసునూరి ప్రభాకర్, ఎంపీపీ కొండ శంకర్ ప్రగాఢ సానుభూతిని తెలిపి అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి రూ.399 భీమా తీసుకుంటే ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు. ఆనంతరం మంథని ఎంపిపి శంకర్ మాట్లాడుతూ మంథని పరిధిలో ఉన్న ప్రజలందరికీ ఈ పాలసీ గురించి అవగాహన కలిపించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ పాలసీలని తీసుకునే విధంగా కృషి చేస్తానని సూచించారు.ఈ కార్యక్ర మంలో ఖానాపూర్ సర్పంచ్ పుట్ట రామయ్య,ఇన్స్పెక్టర్ పోస్ట్స్ నరేష్ అరికాల,పోస్టు మాస్టర్ రవి,ఐపిపిబి మేనేజర్ శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ అధక్షులు అంకరి కుమార్ మరియు ఇతర తపాలా సిబ్బంది పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!