సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి
మంథని ఎస్సై మధుసూదన్ రావు
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 15 (కలం శ్రీ న్యూస్) :సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ మధుసూదన్ రావు అన్నారు.శనివారం పెద్దపల్లి జిల్లా మంథని బాలికల జూనియర్ కళాశాలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్,లాప్ టాప్ ల వంటి పరికరాల వినియోగం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులు,సందేశాలకు సమాధానాలు ఇవ్వకూడదన్నారు. ఏదయినా ఓటీపి కోసం కాల్స్ వస్తే ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకూడదన్నారు. మొబైల్ వినియోగాన్ని ఎంత తక్కువ చేస్తే అంత మంచిది అన్నారు.చదువుకునే వయసులో ఇతర వ్యాపకాలు పెట్టుకోకుండా ఉండాలన్నారు.సమాజంలో జరిగే ప్రతి అంశాన్నిపరిశీలించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పడుతున్న శ్రమను గుర్తించాలన్నారు.జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండేందుకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ప్రిన్సిపాల్ ఝన్షి, అధ్యాపకులు శ్రీధర్ రావ్, శశాంక్, తిరుపతి, తిరుమల్ , నగేష్, శ్రీదేవీ, ఎల్ ఆర్ కే రెడ్డి, మానస, చిన్నయ్య, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ నాయక్, కానిస్టేబుళ్లు సంతోష్ కుమార్, సురేష్ పాల్గొన్నారు.