రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన ఎండపల్లి మండల బీఆర్ఎస్ శ్రేణులు
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్
ఎండపల్లి/ రిపోర్టర్ శ్రీకాంత్ గౌడ్
ఎండపల్లి జూలై 12 (కలం శ్రీ న్యూస్):రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వద్దన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ను ఎండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ తీవ్రంగా ఖండించారు.బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఎండపల్లి మండల కేంద్రం లోని రాష్ట్ర రహదారి పై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను దహనం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉచితాలు వద్దంటూ రైతులను మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే ఇక 3 గంటల కరెంట్ వస్తుందనీ,మళ్లీ పాతరోజులు వస్తాయని జోస్యం చెప్పారు.బీజేపీ మోటార్లుకు మీటర్లు పెట్టాలని, కాంగ్రెస్ 24గంటల విద్యుత్ వద్దు అని అంటుందని ఈ రెండు పార్టీలు రైతులను నిలువునా వంచిస్థాయనీ విమర్శించారు. కాంగ్రెస్,బీజేపీని బంగాళాఖాతంలో పాతరేయాలని పిలపునిచ్చారు. సిఎం కేసీఆర్ రైతు పక్ష పాతి అని రైతు బందు, రైతు భీమా, 24గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు రేండ్ల కృష్ణ,గాదం భాస్కర్,వనం రమణయ్య కొమ్ము సంజీవ్,యూత్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు, కోడి గంగయ్య, మంతెన భూమేష్, ఉప్పు రాజయ్య,మొగిలి జంపయ్య, సంగరాములు,బోయిని సతీష్, రెడ్డి మల్ల రాజేష్, మంతెన సురేష్, కుమార్ ,నరేష్, అంజయ్య, నారాయణ, వెంకటేష్, సురేష్, మహి పాల్ రెడ్డి, లక్ష్మన్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.