Saturday, July 27, 2024
Homeతెలంగాణనాగారం గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

నాగారం గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

మంథని మండలం నాగారం గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జూలై 11 (కలం శ్రీ న్యూస్):ప్రతి వార్డులో సమావేశం నిర్వహించి స్వచ్ఛ భారత్ మిషన్, పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలి గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతకు, పారిశుద్ధ్యనికి అధిక ప్రాధాన్యత కల్పించాలని, ఇంకుడు గుంతల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఆదేశించారు.

మంగళవారం మంథని మండలంలోని నాగారం గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి నాగారం గ్రామపంచాయతీ భవనంలో పారిశుధ్య నిర్వహణపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని,గ్రామంలో అవసరమైన కమ్యూనిటీ ఇంకుడు గుంతలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో పరిసరాల పరిశుభ్రతకు, నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.గ్రామంలోని ప్రతి ఇంటికి సమాచారం అందించి వార్డుల వారీగా సమావేశం నిర్వహించి పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మరుగుదొడ్డి వినియోగం,ఇంకుడు గుంతల ఏర్పాటు,మొక్కల పెంపకం,తడి చెత్తతో కాంపోస్ట్ ఎరువు తయారీ, తదితర అంశాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు,రోడ్లు,సైడ్ డ్రైయిన్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో ప్లాస్టిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని,గ్రామంలో ఉన్న ప్లాస్టిక్ ప్రత్యేకంగా సేకరించి కేటాయించిన ఏజెన్సీకి అప్పగించాలని కలెక్టర్ తెలిపారు.

స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ పై గ్రామ ప్రజలకు సంపూర్ణ అవగాహన ఉండేవిధంగా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు. తడి, పొడి చెత్త వేరు వేరు చేసి సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రోజు వాడే నీటిని కిచెన్ గార్డెన్, ఇండ్ల ప్రాంగణంలో నాటిన మొక్కలకు మళ్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. అనంతరం గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎరువుల తయారీ విధానాన్ని పరిశీలించారు.అనంతరం న్యాక్ భవనంలో శిక్షణ పొందిన గ్రామస్తులతో కలెక్టర్ చర్చించి వారికి ఉపాధి హామీ క్రింద పని లభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్, స్వచ్ఛ భారత్ మిషన్ మేనేజర్ రాఘవులు, ఎంపీడీవో రమేష్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!