Thursday, September 19, 2024
Homeతెలంగాణఅంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన గ్రామపంచాయతీ కార్మికులు

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన గ్రామపంచాయతీ కార్మికులు

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన గ్రామపంచాయతీ కార్మికులు

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్

మంథని జూలై 11(కలం శ్రీ న్యూస్): గ్రామపంచాయతీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని గత ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు మంగళవారం వినూతన రీతిలో సమస్యలు పరిష్కరించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వారి యొక్క సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎస్సీ నియోజకవర్గ ఇన్చార్జ్ మంథని శ్యామ్యాల్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని గత ఆరు రోజులుగా రోడ్డుమీదికి వచ్చి సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని అన్నారు. గ్రామపంచాయతీ వ్యవస్థలో 90% ఎస్సీ ఎస్టీలు బీసీలు మాత్రమే పనిచేస్తున్నారని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు అందరూ కూడా కేవలం దళిత జాతులకు చెందినవారు కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ మొండిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని తీసుకువచ్చి ఏ ఒక్క హోదాని చెప్పుకోకుండా కూడా చేశారని అన్నారు.వారి యొక్క సమస్యలను తెలపడానికి సమ్మె చేస్తా ఉంటే ఈరోజు వారి గొంతులను నొక్కే విధంగా కార్యదర్శులను సర్పంచ్ లను పెట్టి సమ్మెను విచ్చిన్నం చేయడానికి విచ్చినం చేస్తూ కార్మికులను మీ మీరు సమ్మె విరమింప చేయకుంటే మీ స్థానంలో ఇంకొకరిని పెట్టుకుంటామని చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు.అదేవిధంగా గ్రామ సర్పంచులు మరియు కార్యదర్శులు కార్మికుల యొక్క సమ్మెకు వారి యొక్క సహకారాలు అందించాలని వారిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జేఏసీ సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించి వారి యొక్క డిమాండ్లను పరిష్కారం చూపే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.లేనియెడల ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ డివిజన్ నాయకులు మంథని చెందు,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బావు రవి, రామ్ రాజన్న,నాయకులు మంథని లింగయ్య జిపి యూనియన్ నాయకులు కాసిపేట అశోక్,రాజయ్య,బొద్దుల కొమురయ్య, రవి, జై చందర్, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!