Saturday, July 27, 2024
Homeతెలంగాణఅనర్హులను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం రాజకీయాల్లో నుంచి తప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా

అనర్హులను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం రాజకీయాల్లో నుంచి తప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా

అనర్హులను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం రాజకీయాల్లో నుంచి తప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా 

దళిత మంత్రితో ఓపెనింగ్ కానీ డబుల్ బెడ్ రూమ్ ఏ ఒక్క దళితునికి లేదు

డ్రైవర్లుగా చేస్తే జీతం ఇవ్వాలి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కాదు

ఎలక్షన్లు దగ్గరికి రావడంతో మొదలైన పుట్ట లింగమ్మ ట్రస్ట్ సేవలు

మంథని జనవరి 24(కలం శ్రీ న్యూస్ ):మంథని ప్రెస్ క్లబ్ లో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి,  మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ను ,కాంగ్రెస్ పార్టీ నాయకులను, విమర్శించడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షులు సేగ్గం రాజేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నారెడ్ల ఓదెలు, బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి మంథని సురేష్, యూత్ కాంగ్రెస్ నాయకుడు గాజుల నిఖిల్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఏ ఒక్కరికి కూడా ఇండ్లను ఇప్పియ్య లేదు అనడం మూర్ఖత్వమని శ్రీపాద కాలనీలో, పోచమ్మ వాడలో ప్రజలకు పాత్రికేయ మిత్రులకు కూడా ఇంటి స్థలాలను మంజూరు చేయించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మంథని నియోజకవర్గానికి 62,000 ఇండ్లను మంజూరు చేయించిన ఘనత శ్రీధర్ బాబు కే దక్కిన గౌరవం అని, నత్త నడకన పోచమ్మ వాడ, కూచిరాజుపల్లి, కాకర్ల పల్లి లో అరకోరా డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించి మొత్తం నియోజకవర్గంలో పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ నే ఇండ్లను మంజూరు చేసినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదం అని అన్నారు.

బహుజనులపై దాడి చేయడమే బహుజనవాదమా..

దళితులను డైనింగ్ టేబుల్ పైన పక్కకు కూర్చొబెట్టుకొని భోజనం చేసేది మా నాయకుడు అని, బహుజనుడి అయి ఉండి కూడా పక్కకు కూర్చుండబెట్టుకొని భోజనం చేసే వ్యక్తివి కాదు నీవు అని అన్నారు.పోలీసుల విచారణకు దొరకకుండా భీమవరం పారిపోయి భీమవరంలో దొరికిన దొంగ నువ్వు గానీ కాంగ్రెస్ నాయకులు కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు బలవంతులు కాకపోతే పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ప్రారంభోత్సవం చేయవలసిన అవసరం ఏముందో చెప్పాలని,రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ గత కొద్ది రోజుల క్రితం నిన్ను చరవానిలో ఎలా విమర్శించాడో అందరికీ తెలిసిందే నని,  అధిష్టానం మెప్పుకోసం నాకు పెద్ద అన్న లాంటివాడని చెప్పుకోవడం నీ అధికార దాహానికి నిదర్శనం అని, మంథని మున్సిపల్ పరిధిలోని ఎస్సీ లు,ముస్లిం మైనారిటీలు అర్హులు కాదా ఏ ఒక్కరికి కూడా నిన్న ఇచ్చిన వాటిలో ఎందుకు మంజూరు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని, ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అనునిత్యం విద్యార్థులకు సేవలు చేస్తున్న దుద్దిళ్ళ గణపతి కులం పేరుతో విమర్శించడం సరియైనది కాదని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌష్టిగా ఆహారం ఉపాధ్యాయ వృత్తిలో అనునిత్యం అందించాడు.ఓడిపోగానే బంద్ పెట్టిన పుట్ట లింగమ్మ ట్రస్ట్ సేవలు మళ్లీ 2023 లో తెరపై వస్తున్న ఎన్నికల కోసం అనే తేటతెల్లమైంది. పదవి కోసం ఎవరు ఎంత తాపత్రయపడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు.అర్హులైన పేదలకే ఇండ్లు ఇచ్చానని చెప్పుకుంటున్న పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ అనర్హులను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని మరి పుట్ట మధు రాజకీయ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలియజేయాలన్నారు. రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం కానీ బహుజన కులమైన నాయి బ్రాహ్మణులను కులం పేరుతో అవమానపరిచే విధంగా బీఆర్ఎస్ నాయకులూ సోషల్ మీడియాలలో పెట్టీ నాయి బ్రాహ్మణులను అవమానపరచడం ఇదేనా పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ బహుజనవాదం.ఇప్పటికైనా నాయి బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మంథని సురేష్ తెలియజేశారు.వాటర్ ట్యాంకు దగ్గర నుండి గంగ-రోడ్డు దాకా ఎక్కడ రోడ్డు వేశాడో నిరూపించాలి.చిన్నమ్మ పెద్దమ్మ గుడి పూర్తికాకుండానే పూర్తయిందని చెప్పడం. డ్రైవర్లుగా చేస్తే జీతం ఇవ్వాలి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కాదని,వంట మనిషి, ఇద్దరు డ్రైవర్లు, విరు మంథని మున్సిపల్ పరిధికి చెందిన వారు కాకున్నా కూడా వారికి డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించారని, ఒక్కరిని అనర్హులుగా చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంట అని చెప్పిన పెద్దపెల్లి జెడ్పీ చైర్మన్ మేము నలుగురిని చూపియ్యడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.పోచమ్మ వాడొళ్ళు నా సొంతవాళ్లు అన్నావు నీ సొంత వాళ్ళ దగ్గరికి రావడానికి 200 నుండి 300 వందల మంది పోలీసులు ఎందుకు అవసరం ఉంటారు.2014లో 92 మంది అర్హులు ఉంటే 2023 వచ్చేసరికి అందులో 18 మందికి లక్షల కోట్ల రూపాయల లక్కీ డ్రాలు తాకి అనర్హులు అయ్యారా.రాయలసీమ రుచులు చేసే వంట మనిషి, నీ డ్రైవర్లు, అర్హులు అయితే లిస్టులో ఆగిన 18 మంది పేదలు ఎందుకు అనర్హులు అవుతారో చెప్పలి లేక వారు కూడా మీ ఇంటికి వచ్చి పని చేస్తే అర్హులు అవుతారా.కరెంటు మీటర్లు, డ్రైనేజీలను కూడా నిర్మించకుండా అసంపూర్తిగా ఉన్న నివాసాలను పంపిణీ చేయకుండా శ్రీధర్ బాబు ఆపుతున్నారు అనడం సిగ్గు చెటు. పెదింటి బిడ్డను అంటున్న పెద్దపెల్లి జెడ్పి చైర్మన్ డబుల్ బెడ్ రూమ్ నివాసాలు నిర్మించడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే మరి సొంత డబ్బులు ఎలా సహాయం చేశాడో చెప్పలి.బడుగు బలహీన వర్గాలన్నీ శ్రీధర్ బాబు వెంటే ఉన్నారు.బహుజనులలో పుట్టినంత మాత్రాన బహుజనుడివి కాదు. బహుజన వర్గాలకు న్యాయం చేసే శ్రీధర్ బాబు అసలైన బహుజనుడు అని ఇక ముందు నుండి శ్రీధర్ బాబు పై  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పై చౌకబార్ విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ప్రజాక్షేత్రంలో ప్రజలే సమాధానం చెప్తారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు గోటికారి కిషన్ జీ,మంథని సత్యం, అజీమ్ ఖాన్, రాంరాజశేఖర్, అబ్దుల్ ఆలీం, బండారి ప్రసాద్, కుడుదుల వెంకన్న, మంథని రాకేష్, దొనగోర్ల శ్రీనివాస్,ఉట్ల అనిల్ రెడ్డి, వేల్పుల రాజు,కొమ్మిడి సంతోష్, గొల్లపల్లి శ్రీనివాస్, ఆగే రమేష్, అక్కపాక సదయ్య, లక్కేపుర్ రాజేందర్ మంథని శ్రీనివాస్, మంథని సమ్మయ్య,పెరుగు తేజ, సల్మాన్,ఇందారపు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!