బిజెపి లో చేరిన బి.ఎస్.పి మాజీ మండల అధ్యక్షులు బూడిద మల్లేష్
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 10( కలం శ్రీ న్యూస్): మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన బహుజన సమాజ్ పార్టీ మాజీ మంథని మండలా అధ్యక్షులు బూడిద మల్లేష్ తన అనుచరులతో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా పార్టీలో చేరిన బూడిద మల్లేష్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ సంక్షేమ పథకాలకి ఆకర్షితుడినై రానున్న ఎన్నికలలో సునీల్ రెడ్డి గెలుపే ధ్యేయంగా పనిచేస్తానని,అదే విధంగా మంథని నియోజకవర్గంలో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బిఆర్ఎస్ ప్రజా సమస్యలపై నిర్లక్షంగా వ్యవహరించి,ప్రజా సమస్యలని వీరు ఇద్దరు నాయకులు గాలికి వదిలివేశారని, తద్వారా మంథనిలో నిరుద్యోగం, అవినీతి,అసమర్ధత పాలన రోజు రోజుకి పెరిగిపోతుందని, కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణాలో ఈ సారి బీజేపీ ప్రభుత్వం మన మంథని నియోజకవర్గంలో చంద్రుపట్ల సునీల్ రెడ్డి తో మాత్రమే అభివృద్ధి సాధ్యమని నమ్మి సోమవారం సునీలన్న సమక్షంలో బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంథని అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మల్క మోహన్ రావు, బీజేపీ మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్, పట్టణా అధ్యక్షులు బూడిద తిరుపతి,సీనియర్ నాయకులు కొరబోయిన మల్లికార్జున్ పటేల్, కొండా పాక సత్యప్రకాష్,,బోగోజు శ్రీనివాస్,ఎడ్ల సదశివ్,ఎడ్ల సాగర్, చీదురాల మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.