జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 10( కలం శ్రీ న్యూస్ ):జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరీ శంకర్ గౌడ్ పిలుపుమేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పైన మన రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తున్న క్రమంలో సోమవారం మంథని నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మాయ రమేష్, ఆధ్వర్యంలో మంథని పోలీస్ స్టేషన్ లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మంథని మండల అధ్యక్షులు ఈరవేణ ఓం ప్రకాష్, సిద్ది కిరణ్ కుమార్,మేకల శ్రావణ్, వేల్పుల మహేష్,దూడపాక దామోదర్, కొండ వేణు,బైరి శివతేజ,జంగిడి కిరణ్,జోగు ఆదర్శ,చంద్రగిరి గణేష్,తీర్థాల సురేష్, తదితరులు పాల్గొన్నారు.