మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన నాయి బ్రాహ్మణులు
ధర్మారం, జులై 10 (కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలలో అమరపెళ్లి నారాయణ,లింగన్న వారి తల్లి రాజవ్వ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం రాజవ్వ చిత్రపటానికి పూలమాలలు వేసి,వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని కోరుకోవడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎండపల్లి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మందపల్లి శ్రీనివాస్,వెల్గటూర్ ప్రధాన కార్యదర్శి పసుపునూటి అనిల్,ఉపాధ్యక్షులు వేయిగండ్ల నరసింగం,బీర్సాని గంగన్న,వెయ్యిగండ్ల రవి,నరేష్ తదితరులు పాల్గొన్నారు.