పిల్లలకు గోరింటాకు విశిష్టతను తెలిపిన మాతాజీలు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 10 (కలం శ్రీ న్యూస్): మంథని మున్సిపల్ లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం విద్యాలయంలో సోమవారం ఆషాడ మాసం పురస్కరించుకొని గోరింటాకు విద్యార్థులకు పరిచయం చేసి పాఠాలతోపాటు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం అయిన శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యాలయంలో ఆషాడమాసం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆషాడ మాసంలో వాతావరణ మార్పుకు అనుగుణంగా మన శరీరాన్ని చల్లబరచడంలో ఎంతో సహాయం చేసే గోరింటాకు విశిష్టతను పిల్లలకు వివరించి వారికి గోరింటాకు అద్ది ఒక వేడుకలాగా జరిపామని తెలిపారు.ప్రతి సాంప్రదాయం వెనక సైన్స్ ఉంటుందని,అది పిల్లలకు తెలిపి వాళ్ళు అది పాటించేలా చేయడం ప్రతి పాఠశాల యొక్క బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు బెజ్జాల హరికిరణ్,జిల్లా కార్యదర్శి గోటికారి శ్రీనివాస్,కార్యదర్శి మాడిశెట్టి సురేందర్,ప్రధాన ఆచార్యులు నాంపల్లి సంధ్య, మాతాజీలు,పిల్లలు,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.