Thursday, December 26, 2024
Homeతెలంగాణమార్కెట్‌ విలువకనుగుణంగా అవార్డు ప్రకటించాలే

మార్కెట్‌ విలువకనుగుణంగా అవార్డు ప్రకటించాలే

మార్కెట్‌ విలువకనుగుణంగా అవార్డు ప్రకటించాలే

జిల్లా కలెక్టర్‌కు పుట్టపాక వాసుల వినతి

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,జూలై 10 (కలం శ్రీ న్యూస్):గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే నిర్మాణంలో బాగంగా మంథని మండలం పుట్టపాక గ్రామంలో భూములు, ఇండ్లు కోల్పోతున్నదృష్ట్యా మార్కెట్‌ విలువకు అనుగుణంగా అవార్డు ప్రకటించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణకు పుట్టపాక వాసులు వినతిపత్రం అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ను పుట్టపాక గ్రామస్తులు కలిసి తమ సమస్యను విన్నవించి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పుట్టపాక గ్రామ పరిధిలోని భూములన్ని రెండు పంటలు తీసుకునే భూములని,ఈ భూములు అభివృద్ధి నిమిత్తము చాలా ఖర్చులు చేసి సాగు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ భూములన్ని కేవలం వ్యవసాయ భూములే కాకుండా మంథని నుండి పెద్దపల్లి వెళ్లు ఆర్‌అండ్‌బీ రోడ్డును ఆనుకొని నివాస గృహాలు కలిగిన భూమి భూసేకరణలో పోతున్న క్రమంలో ఈ భూములు ఒక గజానికి రూ.8వేల చొప్పున బహిరంగ మార్కెట్ విలువ ఉందన్నారు. పుట్టపాక గ్రామ పరిధిలో నివాస గృహాలు పూర్తిగా కోల్పోవడంతో పాటు పునరావాసం కోల్పోయి, నిరాశ్రయులమవుతున్నామని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్రయోజనాలు కల్పించి భూ సేకరణలో భూములు కోల్పోతున్నచిన్న కారు సన్నకారు రైతులకు జీవన భృతి కల్పించాలని,భూ సేకరణకు సంబంధించిన 3 ఎ నోటిఫికేషన్ మార్చి 2021న ప్రకటించబడి నేటికి అవార్డు కాలేదని,3ఎ కు అవార్డు మధ్య 3 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రభుత్వమే 200 శాతం మార్కెట్ విలువను పెంచడం వల్ల 3ఎ నోటిఫికేషన్ నాటి ధరలను కాకుండా అవార్డు జారీ చేయు నాటి ధరలను ప్రామాణికంగా తీసుకోవాలని వారు కోరారు. పుట్టపాక నిరాశ్రయులకు 3 ఎ నోటిఫికేషన్ నాటి మార్కెట్ విలువకు బదులుగా అవార్డు ప్రకటించు నాటికి ఉన్న బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం అవార్డు చేయాలని వారు జిల్లా కలెక్టర్‌ను వినతిపత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!