మానవత్వానికి మారుపేరు ఖానాపూర్ యువత
మంథని,జూలై 9,(కలం శ్రీ న్యూస్): ఖానాపూర్ యువత ఆపదలో ఉన్న వారికి సహాయం చేసి తమ ఊదరత స్వభావం చాటుకున్నారు. ఆదివారం మంథని మండలంలోని ఖానాపూర్ గ్రామంలో గ్రామ మల్టీపర్పస్ వర్కర్ గా పని చేస్తున్న ఆరెల్లి రిష్ కుమార్ తండ్రి రాజయ్య ఇటీవలే మరణించగా గ్రామ యాదవ సంఘం యువకులు అంతా కలిసి రిషి కుమార్ కుటుంబానికి క్వింటాల్ బియ్యం,నెలకు సరిపడా కిరాణా సామాను అందజేసి గొప్ప మనస్సును చాటుకున్నారు. సహాయం అందించిన యాదవ సంఘం యువకులను గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం సభ్యులు పెగడ రాజు,బాస సది,అమ్మకుంటి సమ్మయ్య,నర్రా శంకరయ్య,బాస కొమురయ్య,రాధరపు కోటేశ్వర్, పర్షవేన సంజయ్ కుమార్, జిల్లా కొమరయ్య, అమ్మకుంటీ సాగర్, అమ్మకుంటి శ్రీనివాస్,పెగడ మహేష్ ,అమ్మకుంటి శ్రీధర్, కానగంటి ఓదేలు,రాపాక నరేష్ , పర్ష సంతోష్,పర్షవేన కుమార్, దొరగొర్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.