బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కొప్పుల
ఎండపల్లి రిపోర్టర్ / శ్రీకాంత్ గౌడ్
జులై 08, (కలం శ్రీ న్యూస్):ఎండపెల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన,జగిత్యాల జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్ గొల్ల నరేష్ తండ్రి గొల్ల నర్సయ్య ఇటీవల అనారోగ్యం తో మరణించగా శనివారం రోజున వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్.ఈ కార్యక్రమంలో ఎండపల్లి సర్పంచ్ మారం జలంధర్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్,పొన్నం తిరుపతి గౌడ్, టిఆర్ఎస్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.