Sunday, May 26, 2024
Homeతెలంగాణజగిత్యాలరాజరాంపల్లి అక్షర హైస్కూల్లో గోరింటాకు వేడుకలు

రాజరాంపల్లి అక్షర హైస్కూల్లో గోరింటాకు వేడుకలు

రాజరాంపల్లి అక్షర హైస్కూల్లో గోరింటాకు వేడుకలు

ఎండపల్లి రిపోర్టర్ / శ్రీకాంత్ గౌడ్ 

జూలై 08, (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజరాంపల్లి అక్షర హైస్కూల్ లో శనివారం ఆషాడ మాసం సందర్భంగా గోరింటాకు (మెహెందీ) వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రిన్సిపల్ అనంతరెడ్డి మాట్లాడుతూ గోరింటాకు ఆచార పరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని, ఈ గోరింటాకును ఆషాడమాసంలోనే కాకుండా సంవత్సరం అంతా గోరింటాకును ధరించవచ్చునని తెలిపారు.విద్యార్థులు వివిధ రకాల ఆకృతులలో చేతులని అలంకరించడం చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఆశి రెడ్డి,ప్రిన్సిపల్ అనంతరెడ్డి,డైరెక్టర్ గోనె రమేష్, ,మంగ,జ్యోతి,లత,ఇంచార్జ్ పుట్ట లత, అభిలాష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!