Thursday, September 19, 2024
Homeతెలంగాణమున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,జూలై 8( కలం శ్రీ న్యూస్):మున్నూరు కాపు ఫైనాన్స్‍ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షుడు మల్క రామస్వామి కోరారు.మంథనిలో శనివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మాణం చేసిన సీఎం కేసీఆర్‌ పోస్టుకార్డు ద్వారా వినతి పత్రాన్ని పంపించారు. ఈ సందర్భంగా మల్క రామస్వామి మాట్లాడుతూ మున్నూరు కాపు ఫైనాన్స్‍ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడంతో పాటు రూ.5వేల కోట్ల నిధులు కేటాయించాలని,రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో విద్యార్థినీ, విద్యార్థుల కోసం హాస్టల్‌ భవనాలు నిర్మాణం కోసం ఎకరం స్థలం, రూ. 2కోట్ల నిధులు కేటాయించాలని, జనాభా ప్రాతిపాదికన మహిళలకు అన్ని రంగాల్లో, రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలని,కోకాపేటలో మున్నూరు కాపులకు ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల భూమి,రూ.5 కోట్ల నిధులు సరిపోవడం లేదని,జనభా ప్రాతిపాదికన దానిని రెట్టింపు చేయాలని పోస్టు కార్డు వినతి పత్రంలో పేర్కొనడం జరిగిందన్నారు.ఈ పోస్టు కార్డులను మున్నూరు కాపు కులస్థులంతా సీఎం కేసీఆర్‌ కు పంపించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఆమిరిశెట్టి రామస్వామి,మంథని డివిజన్‌ అధ్యక్షుడు ఆకుల కిరణ్‌, రాజాబాబు, శ్రీధర్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!