పోతర వేణి క్రాంతి ని సన్మానించిన మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 8( కలం శ్రీ న్యూస్):ఇటీవల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపెల్లి జిల్లా డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మంథని పట్టణంలోని బోయిన్ పేటకు చెందిన పోతర వేణి క్రాంతి ని శనివారం బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రామ్ రెడ్డి మర్యాదపూర్వకంగా క్రాంతి కి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియ చేశారు. క్రాంతి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని క్రాంతి ని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మంథని మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్,పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి,ఉప అధ్యక్షులు రేపాక శంకర్, బూడిద రాజు, పట్టణ ఉప అధ్యక్షులు దాసరి శ్రావణ్,బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బుర్ర రాజు గౌడ్, రావుల చంద్రయ్య,రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.