Saturday, July 27, 2024
Homeతెలంగాణగ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్స్ ఉద్యోగుల దీక్షకు బీజేపీ మద్దతు

గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్స్ ఉద్యోగుల దీక్షకు బీజేపీ మద్దతు

గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్స్ ఉద్యోగుల దీక్షకు బీజేపీ మద్దతు

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జులై 8( కలం శ్రీ న్యూస్):గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గత రెండు రోజుల నుండి చేస్తున్న దీక్షా శిబిరాన్ని శనివారం బిజెపి పార్టీ బృందం సందర్శించి వారి పోరాటానికి భారతీయ జనతా పార్టీ బిజెపి మంథని మండల కమిటీ మరియు మంథని పట్టణ కమిటీ తరఫున సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్ పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని బూటకపు హామీలిచ్చి చిన్నచిన్న ఉద్యోగులపై అధిక పని భారం మోపడమే కాకుండా కనీసం వారికి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని గ్రామపంచాయతీ కారోబార్లకు గత ఐదు నెలల నుండి జీతాలు చెల్లించలేదని వారి కుటుంబాలు ఏ విధంగా జీవనం కొనసాగించాలో అయోమయ పరిస్థితిలో ఉన్నారని తక్షణమే వారి జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్స్ లను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి వారికి పిఆర్సి విధానాన్ని అమలుపరిచి పర్మినెంట్ చేయాలని అదేవిధంగా 12 గంటల దినాన్ని పెట్టి వారిచే వెట్టి చాకిరీ విధానానికి స్వస్తి పలికి ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలని అదేవిధంగా అర్హతలు ఉన్న కారోబార్లను సహాయ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోషన్లు ఇవ్వాలని, గ్రామపంచాయతీ ఉద్యోగులకు ఈఎస్ఐ,పిఎఫ్ లాంటి కనీస మౌలిక ఏర్పాట్లు చేయాలని లేనిచో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ముత్తారం మండల ఇంచార్జ్ పోతర వేణి క్రాంతి,ఉప అధ్యక్షులు బూడిద రాజు,రేపాక శంకర్, పట్టణ ఉప అధ్యక్షులు దాసరి శ్రవణ్ ,బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బుర్ర రాజు గౌడ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!