Wednesday, September 18, 2024
Homeతెలంగాణకంటి వెలుగు పేదల జీవితంలో వరం

కంటి వెలుగు పేదల జీవితంలో వరం

కంటి వెలుగు పేదల జీవితంలో వరం

మున్సిపల్ ఛైర్ పర్సన్ ముత్యం సునీత

సుల్తానాబాద్,జనవరి24,(కలం శ్రీ):

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పేదల జీవితాల్లో వరం లాంటిదని మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత గౌడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రెండవ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు వైద్య పథకాలను ప్రవేశ పెడుతూ పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి  సూచన మేరకు ప్రతి వార్డులో క్యాంపు నిర్వహిస్తూ ఆయా వార్డులోని అర్హులను గుర్తించి కంటి అద్దాలతో పాటు మందులు అవసరమైన వారికి ఆపరేషన్లు ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ,మున్సిపల్ మేనేజర్ అలీముద్దీన్, వైద్యులు డాక్టర్ మధుకర్ రెడ్డి, శ్రీజ, హెచ్ ఈ ఓ శ్రీనివాస్ రెడ్డి, ఏ ఎన్ మ్ లు సరస్వతి, శారదా, కవిత ఆర్పీ మంజుల, వార్డు ఆఫీసర్ వినోద్ ,ఆశ వర్కర్ల తో పాటు పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!