సీఈఐఆర్ ద్వారా బాధితుడికి మొబైల్ అందజేసిన ఎస్సె సత్యనారాయణ
ఎస్సై సత్యనారాయణ కి కృతజ్ఞతలు తెలిపిన బాధితుడు
ధర్మారం, జులై 08(కలం శ్రీ న్యూస్): సిఈఐఆర్ పోర్టల్” ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ను రికవరి చేసి మొబైల్ ను బాధితునికి అందజేసినట్లు స్తానిక ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ధర్మారం గ్రామానికి చెందిన మెడవేని గంగాధర్ తన యొక్క సాంసంగ్ మొబైల్ ధర్మారం మార్కెట్లో ఎక్కడ పడవేసుకొని అట్టి విషయాన్ని ధర్మారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా శనివారం రోజున బాధితునికి మొబైల్ అప్పగించినట్లు తెలిపి ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న దొంగతనానికి గురైన అట్టి వివరాలు సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ నందు నమోదు నమోదు చేసుకోగలరని,ఈ పోర్టల్ ద్వారా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని ఇట్టి అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఎస్సై సత్యనారాయణ సూచించారు.