వాహనాల తనిఖీ చేసిన ధర్మారం పోలీసులు
ధర్మారం, జూలై 07 (కలం శ్రీ న్యూస్):ధర్మారం మండలంలోని పత్తిపాక x రోడ్ రహదారి వద్ద శనివారం ఉదయం రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు ధర్మారం ఎస్సై సత్యనారాయణ వాహనాల తనిఖీలు చేపట్టారు.
వాహనదారులు రికార్డ్ లు తనిఖీ చేసి రికార్డ్ లు లేని వాహనదారుల కు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహన చొదరులకు, నిబంధనలు పాటించని వారికి ఈ చలన విధించారు. ఈ సందర్భంగా ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్ నియమ నిబంధనలు పాటించలని కోరారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నారు, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ధర్మారం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.