Saturday, July 27, 2024
Homeతెలంగాణఅధికారం రాకముందే ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించాం, అధికారం వస్తే వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు...

అధికారం రాకముందే ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించాం, అధికారం వస్తే వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం

అధికారం రాకముందే ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించాం, అధికారం వస్తే వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం

దాసరి ఉష బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి

పెద్దపల్లి జూలై 06 (కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి 10వ వార్డ్ లో మన ఊరు మన ఉష కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి ఉష హాజరై అనంతరం పత్రిక మిత్రులతో మాట్లాడుతూ మన ఊరు- మన ఉష కార్యక్రమం 18వరోజులో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని 10వ వార్డ్ లో పర్యటించి ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి బహుజన్ సమాజ్ పార్టీని పరిచయం చేస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరామ్ గారి నోటు ఇవ్వండి – ఓటు వెయ్యండి అనే నినాదంతో ముందుకు వెళ్తూ, ప్రజల ఆశీర్వాదాలు పొందుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే రూపాయి రూపాయితోనే బీఎస్పి ఎమ్మెల్యే నామినేషన్ వేయడం జరుగుతుందన్నారు, అధికారం రాకముందే డాటా సైన్స్ ప్రోగ్రాంతో యువతీ యువకులకు సాప్ట్ వేర్ ఉద్యోగ అవకాశాలు కల్పించామని, అధికారం వస్తే యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు, అదేవిధంగా భూస్వాములకు ప్రైవేటు సంస్థలకు ఓట్లు వేసి భూములు, ప్రభుత్వ స్కూలు, ప్రభుత్వ ఆసుపత్రిలు బాగు కావాలంటే బాగుపడవని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మతమైనారిటీలకు రాజ్యాధికారం వస్తేనే మన జీవితాలు బాగుపడతాయన్నారు పెద్దపల్లిలో బీఎస్పీ పార్టీ గ్రామస్థాయిలో బలపడిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మొలుమూరి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు నార్ల గోపాల్ యాదవ్, అసెంబ్లీ కోశాధికారి ఎండి రియాజ్, పెద్దపెల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి అజీమ్, మాజీ అసెంబ్లీ అధ్యక్షులు బొంకూరి సాగర్, మాజీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బొంకురి అన్వేష్, నాయకులు సిపెళ్లి కొమురయ్య, కుమ్మరి కుంట రవికుమార్,అల్లెపు చంద్రశేఖర్, చిన్న మల్లేషం, స్థానికులు మాజీ రంగంపల్లి సర్పంచ్ కొండి కనకయ్య, బండి రంగయ్య, బీవిఫ్ జిల్లా కన్వీనర్ మచ్చ రాహూల్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, బివిఫ్ టీం తదితరరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!