అగ్రరాజ్యంలో మన కళలకు పెరుగుతున్న ఆదరణ
కూచిపూడి నాట్యంతో అలరించిన శ్రియ
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 6/(కలం శ్రీ న్యూస్ ):పాశ్చాత్య దేశాల్లో మన భారతదేశ కళలకు అత్యంత ఆదరణ గుర్తింపు లభిస్తుందడం విశేషం ఒకప్పుడు భారతదేశ కలల పట్ల చిన్నచూపు చూసే పాశ్చాత్య దేశాలు ప్రస్తుతం భారతదేశ కలలను ముఖ్యంగా కూచిపూడి ప్రదర్శన పట్ల మక్కువ పెంచుకోవడం మన కలలుకున్న ప్రాధాన్యాలను చాటి చెబుతుంది ముఖ్యంగా అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ప్రముఖ సంగీత నృత్యకళాశాల కళామండపం ఆధ్వర్యంలో కుమారి రామక శ్రీయ చేసిన నృత్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది నాట్యగురువు మృణాళినీ, సదానందల వద్ద నృత్య ప్రదర్శన నేర్చుకున్న శ్రియ రామక కూచిపూడి నాట్యంలో నృత్యసంభావన (రంగప్రవేశం) చేశారు. ఆనన్డేల్ నగరంలోని రిచర్డ్ జె ఎర్నెస్ట్ సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన సునీత, శశిధర్ ల కుమార్తె శ్రీయ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యప్రభ, మహావాది మారుతిరావు శ్రీయ ను ప్రత్యేకంగా అభినందించారు కుమారి శ్రీయ దివంగత రామక లక్ష్మణమూర్తి అనంతలక్ష్మి ల మనవరాలు. ఈ కార్యక్రమాన్ని సుమారు 400 కళాభిమానులు వీక్షించి శ్రియను ఆశీర్వదించారు. శ్రియ తల్లితండ్రులు గురువులకు, వాద్యబృందానికి సత్కారం చేశారు.