శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
పెద్దపల్లి,జనవరి24,(కలం శ్రీ):
పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రస్తుత కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్ జయశ్రీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. మంగళ వారం మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్ జయశ్రీ దంపతులు ఆలయాన్ని సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.. వారి కుమారుడు మల్లిఖార్జున్ సుష్మిత దంపతులకు కూతురు జన్మించిన సందర్భంా ఇక్కడ స్వామి వారి ఆశీస్సులు పొందడానికి పెద్దపూర్ వచ్చారు.. ఆలయం లో స్వామి వారికి అర్చనలు అభిషేకాలు నిర్వహించారు.. అనంతరము మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్ జయశ్రీ దంపతులను ఆలయ అర్చకులు వెంకన్న సన్మానించి ఆశీర్వచనాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు జిల్లా ఉపాధ్యక్షుడు సాదుల సుగుణాకర్ సునీత దంపతులు పాల్గొన్నారు.