ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల జాతర
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని, జూలై 6 (కలం శ్రీ న్యూస్ ):మంథని మున్సిపల్ పరిధిలోని బోయినిపేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. బోయిన్ పేట నుండి డప్పుల చప్పుల్ల మధ్య ముదిరాజ్ కులానికి చెందిన మహిళలు బోనాలెత్తి గొల్లగూడెం, పాత ఐబి గెస్ట్ హౌస్ నుండి కూచిరాజుపల్లి గ్రామ శివారులోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి కాలినడకన వెళ్లి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కాయితి సమ్మయ్య, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పోలు కనకరాజు, సంఘం నాయకులు సబ్బని సమ్మయ్య, పోతరవేన లక్ష్మీరాజం, పోలు శివ,నడిపి రాజయ్య,నరెడ్ల కిరణ్,తుటి వెంకటేష్,అట్టెం రాజయ్య,అట్టెం శ్రీను,చిలివేరి భూమయ్య,జడగాల లక్ష్మణ్, పోలు రామకృష్ణ ,అల్లం సమ్మయ్య, నేదురు శంకర్,కుంట నరేష్, సబ్బని రాజేష్,సుంకరి జగదీష్,మూగ శ్రీకాంత్ లతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.