ప్రజల ప్రేమ గెలుచుకున్న బండి ప్రకాష్
వీడ్కోల సమావేశంలో వక్తల అభిప్రాయం
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 5 (కలం శ్రీ న్యూస్ ):గత రెండు సంవత్సరాల క్రితం మంథని ఎమ్మార్వో గా బాధ్యతలు చేపట్టిన బండి ప్రకాష్ ఈ ప్రాంత ప్రజల ప్రేమను చూడకున్నారని మంథని ఎంపీపీ కొండా శంకర్ అన్నారు. బుధవారం ఎంపీపీ కార్యాలయం లో జరిగిన ఎమ్మార్వో బండి ప్రకాష్ వీడ్కోలు సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగించారు. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రంగా పేరుగాంచిన మంథని ప్రాంతంలో అనేక సమస్యలతో రైతులు సతమవుతమవుతుండే వారిని అలాంటి వారి సమస్యలు తీర్చడంలో ఆయన సఫలీకృతులైనారని పేర్కొన్నారు. అనంతరం టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తగరం శంకర్ లాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచేవారని సమస్యల సాధనకు పూర్తిస్థాయిలో కృషిచేసిన ఎమ్మార్వో బండి ప్రకాష్ తిరిగి మంథని కి ఆర్డీవో గా రావాలని ఆకాంక్షించారు. సీనియర్ పాత్రికేయుడు పోతరాజు సమ్మయ్య మాట్లాడుతూ ధరణి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారి సమస్యలు తీర్చడంలో సార్ సఫలీకృతులు అయ్యారని బండి ప్రకాష్ సేవలను కొనియాడారు. అనంతరం బండి ప్రకాష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తగరం సుమలత, రైతుబంధు అధ్యక్షుడు ఆకుల కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనంత రెడ్డి, ఇంచార్జ్ ఎమ్మార్వో తో పాటు రాజమౌళి గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు బండి ప్రకాష్ అభిమానుల కార్యక్రమంలో పాల్గొన్నారు.