Thursday, September 19, 2024
Homeతెలంగాణకాంగ్రెస్ పార్టీ హయంలోనే అభివృద్ధి 

కాంగ్రెస్ పార్టీ హయంలోనే అభివృద్ధి 

కాంగ్రెస్ పార్టీ హయంలోనే అభివృద్ధి 

మంథని కాంగ్రెస్ నాయకులు

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జూలై 5 (కలం శ్రీ న్యూస్ ):మంథని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఓడ్నాల శ్రీనివాస్,ఎరుకల ప్రవీణ్ మాట్లాడుతూ నిన్న దొడ్డి కొమరయ్య మహనీయుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ,కెసిఆర్ దొరగడిలో బానిసగా ఉంటూ కాంగ్రెస్ నాయకులను బానిసలు అనడం సిగ్గుచేటు అన్నారు.సాయుధ రైతాంగ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య చరిత్రను అందరూ పుస్తకాలలో చదవడం జరిగిందని అనేకమంది మహనీయుల చరిత్రలు ఈ ప్రాంత ప్రజలకు తెలుసునని మీరు చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు.దొడ్డి కొమురయ్య గొడ్డలి ఎందుకు ఎత్తాడో తెలుసుకోవాలని వారన్నారని ఈ ప్రాంతంలో కొబ్బరి బొండాలు కొట్టే కత్తులతో రక్తపు ఏరులైపారించిన సంగతి మంథని నియోజకవర్గ ప్రజలకు తెలుసునని ఇందిరమ్మ ఇండ్లు అన్ని గ్రామాల్లో ఉన్నాయని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏఊరిలో ఉన్నాయో చూపించాలని అన్నారు.9 సంవత్సరాలు అధికారంలో ఉన్న నువ్వు దళిత బంధు,బీసీ బందు,డబల్ బెడ్ రూమ్ ఇండ్లు,మూడెకరాల భూమి ఎంత మందికి ఇప్పించారని ప్రశ్నించారు.నీ అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసినటువంటి మహనీయుల విగ్రహాల ఆత్మలు శోభిస్తాయని అన్నారు.విధ్యాతోనే అభివృద్ధి సాధ్యమని విగ్రహాలతో కాదని, మీకు దమ్ముంటే ఈ నియోజకవర్గనికి మెడికల్ కాలేజీ తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పొలు శివ, జంజర్ల శేఖర్,మంథని సత్యం,అజింఖాన్, గోటుకారి కిషన్ జి, తోకల మల్లేష్, కుడుదుల వెంకన్న, దొర గొర్ల శ్రీనివాస్ యాదవ్, బండారి ప్రసాద్,ఎల్లంకి వంశీ,అక్కపక సదయ్య, గొల్లపల్లి శ్రీనివాస్, మంథని శ్రీనివాస్, తాళ్లపల్లి సత్యనారాయణ గౌడ్, మంథని సమ్మయ్య, ఎరుకల మోహన్ సాయి, ఆరెల్లి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!