పాటల ఆడియో సిడి ఆవిష్కరణ
మంథని,జూలై05(కలం శ్రీ న్యూస్):మంథనిలో ట్యాంక్ బ్యాండ్ పైన తెలంగాణ తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య విగ్రహం ఆవిష్కరణ పురస్కరించుకొని పుట్ట మదన్న ప్రస్థానం 2023 డీజే సాంగ్ ఆడియో సీడీని ఆవిష్కరించారు.నిర్మాత గాకనవేన శ్రీనివాస్ యాదవ్,రచ్చపల్లి గ్రామ సర్పంచ్,రచయిత గాయకుడు కాశిపేట సంతోష్ కుమార్,ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ వడ్డాది శైలజ మధు నిర్మించిన ఆడియో పాటల సీడీ నీ ప్రముఖ ప్రజా ప్రతీ నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్ల కుంట వెంకటేష్ నేత,పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమాధుకర్,మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ,మంథని జడ్పీటీసీ తగరం సుమలత, మంథని ఎంపీటీసీ కొండ శంకర్, పిఎసిఎస్, ఏఎంసి చైర్మన్ మరియు మంథని నియోజకవర్గం సర్పంచ్ లు,ఎంపీటీసీలు,జడ్పీటీసీలు, బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు యాదవ సంఘము నేతలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.