ఉచిత కంటి శుక్లo శస్త్ర చికిత్సలు విజయవంతం
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 5( కలం శ్రీ న్యూస్):మంథని మండలంలోని పలు గ్రామాల నుంచి లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు,లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ విజన్ కేర్ ఆక్టివిటీస్ డిస్ట్రిక్ట్ కమిటీ ఛైర్మన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత సభ్యులు లయన్ పూదరి దత్తాగౌడ్ ఆధ్వర్యంలో 31 మందికి ఉచిత కంటి శుక్లo శస్త్ర చికిత్సలు లయన్స్ రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ లో విజయవంతంగా నిర్వహించారు.వారందరిని తిరిగి బుధవారం మంథనిలో దింపారు.వీరికి ఉచిత రవాణా భోజన వసతులు కల్పించారు.గోదావరి అర్బన్ మల్టిస్టేట్ క్రెడిట్ కో-అపరేటివ్ సొసైటీ బ్యాంక్ వారి10వ వార్షికోత్సవం సందర్భంగా 10 రోజుల పాటు వివిద సేవ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. బ్యాంక్ ఛైర్మన్ రాజశ్రీ హేమంత్ పాటిల్,ఎండి దనుంజయ్ తాంబేకర్ పిలుపు మేరకు మంథని బ్రాంచ్ మేనేజర్ అంతటి చిరంజీవి గౌడ్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్ చేయించుకున్న 31 మంది పేషంట్లకు బ్రేడ్ ప్యాకెట్లు అందజేయడం జరిగింది.ఉచిత కంటి శస్త్ర చికిత్సలకు సహకరించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320G ఛార్టర్డ్ గవర్నర్ మరియు రేకుర్తి కంటి ఆసుపత్రి వైస్ ఛైర్మన్ లయన్ చిదుర సురేష్ కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పాపారావు,మేడగోని రాజమొగిలి గౌడ్,వెంకటేష్ గౌడ్,నర్సయ్య,లయన్ గౌస్ హుస్సేన్,విజన్ ఐ కేర్ సెంటర్ రాయల్ ఆప్టికల్స్ మంథని నిర్వాహకులు శంషీర్ అలీ పాల్గొన్నారు.