ఉచిత కందుల మినీ కిట్స్ పంపిణీ
ఎండపల్లి రిపోర్టర్ /శ్రీకాంత్ గౌడ్
ఎండపల్లి, జులై 4: (కలం శ్రీ న్యూస్):ఎండపల్లి మండలంలోని గోడిశెలపేట క్లస్టర్ పరిధిలో 5 గ్రామాల రైతులకు మంగళవారం ఉచిత కందులు చిరు సంచులను రైతువేదికలో పంపిణీ చేసినట్లు ఏ ఈ ఓ అయ్యోరి వినోద్ తెలిపారు. పి అర్ జి-176, ఎల్ ఆర్ జి -52 రకాలకు సంబందించిన కందులు మిని కిట్స్ 15 బస్తాలు రైతులకు పంపిణీ చేశారు. అనంతరం రైతులకు పంటకు సంబంధించిన వివరాలు తెలియచేసి “మినీకిట్ల” ద్వారా వచ్చిన పంటను కొనుగోలు కేంద్రాలకు అమ్ముకోకుండా. వాటి నుండి విత్తన సేకరణ చేసి రైతులకు విత్తనాలుగా అమ్ముకోని లబ్ది పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో, మారేడుపల్లి గ్రామ సర్పంచ్ గంధం లక్ష్మీనారాయణ, గోడిశెలపెట్ ఉపసర్పంచ్ జెల్ల శ్రీనివాస్, రైతు సమితి కోఆర్డినేటర్లు బుచ్చిరెడ్డి, బుచ్చిలింగయ్య , రైతులు పాల్గొన్నారు .