కన్న కూతురిని అమ్మేసిన కసాయి తండ్రి
విచారణ చేపట్టిన వెల్గటూర్ పోలీసులు
ఎండపల్లి రిపోర్టర్/ శ్రీకాంత్ గౌడ్
ఎండపల్లి జూలై 4 (కలం శ్రీ న్యూస్):ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన జంగిలి జ్యోతి (32) తన మూడో సంతానమైన 45 రోజుల ఆడ శిశువును ఆమె భర్త జంగిలి లక్ష్మణ్ తనకు తెలియకుండా జమ్మికుంటకు చెందిన లింగాల రమేష్ కు అమ్మేశాడు. ఈ విషయంపై తన భర్తని అడగగా కర్రతో వాళ్ళ అమ్మానాన్నను ఇష్టం వచ్చిట్లు కొట్టాడు. ఈ మేరకు మంగళవారం బాధితురాలు జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్గటూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.