బీఆర్‌ఎస్‌లోకి మల్లారం మాజీ సర్పంచ్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 4(కలం శ్రీ న్యూస్):అభివృధ్ది సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి.మంథని నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ,జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోచేరుతున్నారు. మంగళవారం మంథని పట్టణంలోని రాజగృహాలో మలహార్ మండలంలోని మల్లారం మాజీ సర్పంచ్ కాసిపేట సాంబయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు రొడ్డ లింగయ్య, జనగామ నాగరాజు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పాలనపై ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకుల్లో నమ్మకం పెరుగుతోందని, ఈ క్రమంలో పార్టీలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు చేరుతున్నట్లు జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఈ సందర్బంగా పేర్కొన్నారు.