మంథని జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ప్రత్యేక కృషి..
రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 4( కలం శ్రీ న్యూస్):మంథని ప్రాంతంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ప్రభుత్వ పరంగా కేటాయించడానికి ప్రత్యేక చొరవ తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. మంథనిలో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన అల్లం నారాయణను మంథని ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులు పూలమాలలు శాలువాలతో మంగళవారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ మంథనిలో జర్నలిస్టులు అందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి స్థానిక ఎమ్మెల్యే దుద్దుల శ్రీధర్ బాబుతో పాటు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు తో ప్రత్యేకంగా చర్చించి ప్రభుత్వపరంగా వీటిని మంజూరు చేయించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.మంథని ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.మంథని తమకు జీవితంలో అన్ని పాటలను నేర్పిన కారణంగానే అందరితో ఆత్మీయంగా ఉన్నత స్థాయిలో రాణించడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు.మంథనితో తమకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు.తనను ఆత్మీయంగా సన్మానించిన జర్నలిస్టులకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిజిగిరి శ్రీనివాస్, అంకరి ప్రకాష్,అంకరి కుమార్, పోతరాజు సమ్మయ్య,కొమురోజు చంద్రమోహన్,మహావాది సతీష్, మోత్కూరి శ్రీనివాస్,పెండ్యాల రాము,తగరం రాజు,కంది కృష్ణారెడ్డి,బాసాని సాగర్,గంధం అంజిబాబు,వొజ్జల శ్రీనివాస్, మాటేటి కుమార్,సురేష్,బండారి సమ్మయ్య,అశోకన్,వాసు,నాంపల్లి శ్రీనివాస్,పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు