Friday, July 19, 2024
Homeతెలంగాణపాఠశాల విద్యార్థులకి ఉచిత నోటు పుస్తకాల పంపిణీ

పాఠశాల విద్యార్థులకి ఉచిత నోటు పుస్తకాల పంపిణీ

పాఠశాల విద్యార్థులకి ఉచిత నోటు పుస్తకాల పంపిణీ

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జులై 4( కలం శ్రీ న్యూస్ ): మంథని మండలంలోని ఎక్లాస్ పూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఉదయం జరిగిన సమావేశంలో 80 మంది బీద విద్యార్థులకు ఉచితంగా సింహరాజు మౌనిక రాజు- మంచిర్యాల వాస్తవ్యులు ఉచితంగా నోటు పుస్తకాలను అందజేశారు.అలాగే విద్యార్థులందరికీ పెన్నులు, పాఠశాలలోని తరగతి గదులలో ఫోటో ఫ్రేములు(5) అందజేశారు.

పాఠశాలలో అన్ని గదులకు సరిపడు గోడ గడియారాలను(7) దాతలు నర్సింగరావు -ప్రవీణ దంపతుల ద్వారా స్వీకరించడం జరిగింది. అలాగే ఓవర్ హెడ్ ట్యాంకు కోసం రూపాయలు 3000 గొర్రె శ్రీనివాస్ అనే దాత ద్వారా స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎక్లాస్ పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంపత్ రావు మాట్లాడుతూ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను అందర్నీ అభినందించారు.దాతల ద్వారా విరాళాలు సేకరించిన ప్రధానోపాధ్యాయులు రవీందర్ ఎంతో కృషి చేస్తూ పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని కొనియాడారు.అనంతరం దాతలను పాఠశాల పక్షాన సన్మానించారు.పాఠశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయులైన బోనాల రవీందర్ దంపతులను శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోనాల రవీందర్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వొడ్నాల సహేందర్,చంద్రశేఖర్, గట్టు రమాదేవి,మమత,శ్వేత, సువర్ణ జ్యోతి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!