మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ గా పోతరవేని క్రాంతి కుమార్ ఏకగ్రీవ ఎన్నిక
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 4( కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డిఎఫ్ఓ భాస్కర్ అధ్యక్షతన జరిగిన మత్స్యపారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ మరియు డైరెక్టర్ల ఎన్నిక సందర్భంగా పోతరవేని క్రాంతి ని మంగళవారం మంథని మండల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు,13 సభ్యులు ఏకగ్రవంగా ఎన్నుకున్నారు.
ఈ ఎన్నిక మత్స్యశాఖను బలోపేతం చేయడంలో ఎంతో కీలకంగా ఉంటుందని, రానున్న రోజుల్లో చైర్మన్ కలిపాక నర్సయ్య సహకారంతో మత్స్యశాఖను మరింత బలోపేతం చేసి ప్రతి ఒక్క మత్స్యకారునికి తగువిధంగా ప్రభుత్వ ఫలాలు అందేలాగా కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు.మత్స్య కార్మికుల సమస్యలపై అనుక్షణం ప్రతినిధిగా ఉంటూ తీర్చడానికి ప్రయత్నం చేస్తా అని నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పజెప్పిన మంథని మండలం ప్రతి ఒక్క అధ్యక్షునికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసిన పోతరవేని క్రాంతి కుమార్.