Thursday, December 26, 2024
Homeతెలంగాణమంథని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మహనీయుల వర్ధంతి కార్యక్రమం

మంథని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మహనీయుల వర్ధంతి కార్యక్రమం

మంథని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మహనీయుల వర్ధంతి కార్యక్రమం

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్

మంథని జూలై 4( కలం శ్రీ న్యూస్ ):కామ్రేడ్ దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి, స్వామి వివేకానంద 121వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం మంథని బిజెపి పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు మహనీయుల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి మాట్లాడుతూ ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ మీర్ అలీ ఖాన్ నేతృత్వంలో రజాకార్లు జనగామ జిల్లాలో 1946 నుండి 1948 వరకు గ్రామాలలో పేద ప్రజలను అనేక చిత్రహింసలు పెట్టి నిర్ధాక్షణంగా గొర్ల పెంపకం దారులను, ప్రజల ప్రాణాలు తీసిన సంఘటనలు చూసి దొడ్డి కొమురయ్య తట్టుకోలేక చలించి పోయేవారని, జనగామ జిల్లా విసునూరు అనే గ్రామంలో ప్రజలను ఏకతాటిపై తెచ్చి రజాకార్లకు వ్యతిరేకంగా కర్రలు, కత్తులతో దాడి చేసి రజాకార్లను తరిమారని, అలాంటి పోరాటస్ఫూర్తిని నేటి యువత నేర్చుకోవాలని, అదేవిధంగా స్వామి వివేకానంద ప్రపంచ దేశాలు సైతం నివ్వెర పోయే విధంగా తన ప్రసంగాలతో యువతలో ఉత్తేజాన్ని నింపి జీవిత తత్వశాస్త్రాన్ని, జీవన తత్వ సిద్ధాంతాన్ని బోధించి సమాజం కు దిశా నిర్దేశం చేశారని,రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం చేసి ఆయన పేరుతో ఒక మఠాన్ని స్థాపించి నేటి యువతకు ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించారని, ఆయన ఆశయాలని నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని స్వామి వివేకానంద  తత్వ సిద్ధాంతాన్ని ఆచరించాలని మహనీయుల పోరాటా స్ఫూర్తిని నేటి యువత అలవర్చుకోవాలని బిజెపి పార్టీ పక్షాన ప్రజలకు, యువతకు పిలుపు ఇస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్,బిజెపి సీనియర్ నాయకులు కొండాపాక సత్య ప్రకాష్,బోగోజు శ్రీనివాస్, ఎడ్ల సాగర్,బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బుర్ర రాజు గౌడ్. దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు కాసర్ల సూర్య. సోషల్ మీడియా కో కన్వీనర్ గుమ్మడి నవీన్. ఆకుల అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!