మహనీయుల విగ్రహాల ఏర్పాటు ఒక చరిత్రే
ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌నేత
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 4 (కలం శ్రీ న్యూస్):అట్టడుగు వర్గాల కోసం ఆనాడు పోరాటాలు,త్యాగాలు చేసిన మహనీయుల చరిత్రను చాటిచెప్పేలా విగ్రహాలు ఏర్పాటుచేయడం దేశంలోనే ఒక చరిత్రగా నిలుస్తుందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌నేత అన్నారు.మంథనిలో సాయుధపోరాటమోధుడు తొలి తెలంగాణ అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహవిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఆలోచనతో జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ విగ్రహాల ఆవిష్కరణకు శ్రీకారం చుట్టడం గొప్ప విషయమన్నారు.చరిత్రను తెలుసుకోకుండా విస్మరిస్తే మళ్లీ అణిచివేతకు గురికాక తప్పదని ఆయన అన్నారు.కులాలు,మతాలకు అతీతంగా మహనీయుల విగ్రహాలను ఏర్పాటుచేసిన పుట్ట మధూకర్ చరిత్రలోనిలుస్తారని ఆయన అన్నారు.మహనీయుల స్పూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని సీఎం కేసీఆర్ పూరించారని, ఈనాడు రాష్ట్రంలో సామాజిక న్యాయం అందిస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆయన కొనియాడారు.ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం నిరంతరం కృషి చేస్తున్న పుట్ట మధూకర్‌కు అండగా ఉండాలని,రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుని అసెంబ్లీకి పంపించాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.