నాటు సారా పట్టివేత
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 4 (కలం శ్రీ న్యూస్ ):పెద్దపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్.మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నాటుసారాయినీ తయారు చేసి చుట్టుప్రక్కల గ్రామాలకు వాహనాలపై సరఫరా చేస్తున్నారనే పక్కా సమాచారం మేరకు రూట్వాచ్ (Route Watch ) లో బాగంగా మంథని ఎక్సైజ్ సిఐ జి.గురవయ్య, పెద్దపల్లి డి.టి.ఎఫ్.సిఐ వినోద్ రాథోడ్ ఆధ్వర్యంలో ముత్తారం మండలం నుండి కాల్వశ్రీరాంపూర్ వెళ్ళే రోడ్డులో పారుపల్లి గ్రామం వద్ద రూట్వాచ్ నిర్వహించి, అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయగా 12లీ. నాటు సారాయితో పాటు ఒక ఆటోను స్వాదీనం చేసుకొని ఎదులాపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి. తిరుపతి, బాల్త. రవిందర్ అనే ఇద్దరు వ్యక్తులపై చట్టప్రకారం కేసును నమోదు చేసి అనంతరం ముత్తారం మండల తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సిఐ.జి.గురవయ్య ఒక ప్రకటనలో తెలిపారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ సిఐ జి. గురవయ్య, పెద్దపల్లి డి.టి.ఎఫ్.సిఐ వినోద్ రాథోడ్,ఎక్సైజ్ ఎస్సై ఎం.సాయిరాం, సిబ్బంది రాజేందర్,హరీష్,నిరంజన్, ప్రశాంత్ లు పాల్గొన్నారు.నాటుసారాయి (గుడుంబా) తయారు చేసిన, అమ్మిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కటిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎక్సైజ్ సిఐ ఒక ప్రకటనలో తెలిపారు.