జనసేన మండల పార్టీ అధ్యక్షుడుగా ఈరవేన ఓంప్రకాశ్
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 2 ( కలం శ్రీ న్యూస్):తెలంగాణలో జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెల్లే సదుద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారం నన్ను నమ్మి మంథని మండల అధ్యక్షునిగా ఈరవేన ఓంప్రకాశ్ ను నియమించినందుకు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు .ఇందుకు సహకరించిన జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్, మంథని నియోజకవర్గ ఇంచార్జి మాయ రమేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు. మంథని మండలంలో పార్టీ బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తా అని కోరుకుంటూ నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన పెద్దలకి మరొక సారి ధన్యవాదాలు చెప్పిన ఈరవేన ఓం ప్రకాష్.