విగ్రహావిష్కరణను విజయవంతం చేయండి
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని, జులై 1( కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలోని బొక్కలవాగు వంతెనపై ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాటయోధుడు,తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కోరారు. ఈ నెల 4న దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ చేపట్టనున్న క్రమంలో శనివారం మంథని పట్టణంలోని రాజగృహాలో విగ్రహ ఆవిష్కరణ కమిటి ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం ఆనాడు త్యాగాలు చేసిన మహనీయుల చరిత్రను చాటి చెప్పాలనే ఆలోచనతో మంథనిలో మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు.ఈ క్రమంలో ఈ నెల 4న దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని, ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత,భూపాలపల్లి జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌లు హజరుకానున్నట్లు ఆయన చెప్పారు.విగ్రహవిష్కరణకు నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.