Wednesday, December 4, 2024
Homeతెలంగాణడాక్టర్స్ డే సందర్భంగా డా. బంగారు స్వామికి ఘన సన్మానం

డాక్టర్స్ డే సందర్భంగా డా. బంగారు స్వామికి ఘన సన్మానం

డాక్టర్స్ డే సందర్భంగా డా. బంగారు స్వామికి ఘన సన్మానం

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

 మంథని జూలై 1( కలం శ్రీ న్యూస్):ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ ఆర్తో వైద్యుడిగా సేవలందిస్తున్న డా. బంగారు స్వామిని ఘనంగా సన్మానించారు. శనివారం డాక్టర్స్ డే సందర్భంగా స్థానిక రేనే హాస్పిటల్ లో మంథని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగ పుత్రులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గత రెండు దశాబ్దాలుగా కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బంగారస్వామిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు అంకరి కుమార్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) జాతీయ కార్యవర్గ సభ్యులు అంకరి ప్రకాష్, గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి గంధం వెంకటస్వామి,సంఘం సభ్యులు అంకరి లింగయ్య,అంబటి సతీష్, అంబటి గట్టయ్య, మోసం నరసయ్య, జీదుల రాజేందర్, మర్రి రఘు,అంబటి సురేష్,అంకరి శివ మురళి, రాణవేణ చేతన్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!