వైద్య సిబ్బందికి శానిటైజర్ లు, మగ్గులు, ఫినాయిల్ బాటిల్ అందించిన యువ సంకల్ప ఫౌండేషన్
సుల్తానాబాద్,జనవరి24,(కలం శ్రీ):
సుల్తానాబాద్ పట్టణంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రమాదేవి కి శానిటైజర్స్ ,మగ్గులు , ఫినాయిల్, ఇతర వస్తువులు అందించడం జరిగినది. ఈ సందర్భంగా యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో వీరు చేసిన సేవలు అద్భుతం అని, వీరి సేవా వల్లనే మనం ఇలా బతుకుతున్నామని, వీరికి మనం ఎంత చేసినా తక్కువేనని అన్నారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది అడగగానే ఈ వస్తువులు ఇచ్చినందుకు ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు అని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమాదేవి, మెడికల్ సూపరిండెంట్ హెడ్ నర్స్ వసంత, మెడికల్ ఆఫీసర్స్ మహేందర్, మెడికల్ సిబ్బంది వెంకటాచారి,నరేష్,అమర్, యువ సంకల్ప ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మ నిశాంత్, ఆషాడపు క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.