ఊరి కొలుపు ఉత్సవాలు ఐక్యతకు తోడ్పాటునిస్తయి
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 1( కలం శ్రీ న్యూస్ ):ఊరంతా కలిసి ఆనందోత్సహాలతో జరుపుకునే ఊరి కొలుపు ఉత్సవాలు అన్ని వర్గాల ప్రజల ఐక్యతకు తోడ్పాటునందిస్తాయని మంథని నియోజకవర్గ భీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.
మహదేవ్‌పూర్ మండల కేంద్రంలో శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించిన మైసమ్మ, ఊరి కొలుపు ఉత్సవాల్లో భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌తో కలిసి ఆయన పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరి కొలుపు ఉత్సవాలకు హజరైన జిల్లా పరిషత్ చైర్మన్‌లకు గ్రామస్తులు,నిర్వహణ కమిటి సభ్యులు ఘన స్వాగతం పలికారు.డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్బంగా మైసమ్మతల్లిని దర్శించుకున్న వారు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతికి మళ్లీ బీజం పడిందని,అనేక గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రజలంతా కలిసికట్టుగా ఉత్సవాలు జరుపుకుంటున్నారని ఆయన అన్నారు.పూర్వం నుంచి ఆనవాయితీగా వచ్చే ఉత్సవాలు గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని,ఈనాడు ఎంతో గొప్పగా జరుపుకోవడం శుభ పరిణామమని అన్నారు.ఊరంతా కలిసి అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే మైసమ్మ, ఊరి ఉత్సవాల్లో తాము పాల్గొనడం అదృష్టమన్నారు.మైసమ్మ తల్లి దీవెనలు అందరిపై ఉండాలని ప్రజలంతా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఈ సందర్బంగా వేడుకున్నారు.