ప్రిన్సిపాల్ కి ఘన సన్మానం
సుల్తానాబాద్,జూన్30(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రిన్సిపాల్ శ్రీధర్ కి ఘన స్వాగతం పలికారు. ఘనంగా శాలువాతో సన్మానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తొగర్రాయి గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు, నాలుగవ వార్డు సభ్యులు గడ్డం అనిల్ గౌడ్, రమేష్, శ్రీనివాస్, సాయి నవదీప్ , పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు ఉన్నారు