మెగాస్టార్ చిరంజీవి మనవరాలి పేరు ఏమిటో తెలుసా….
హైదరాబాద్, జూన్30(కలం శ్రీ న్యూస్):మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు జూన్ 20 మంగళవారం నాడు పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. దాంతో మెగా అభిమానులందరు పండగ చేసుకున్నారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో కొన్ని రోజులకే ఉపాసన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక డిశ్చార్జ్ అయ్యే క్రమంలోనే రామ్ చరణ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సమావేశంలో తన కూతురు పేరును 21వ రోజు వెల్లడిస్తామని, ఉపాసన, నేను ఓ పేరు అనుకున్నామని చెప్పుకొచ్చారు. కానీ 21వ రోజుకు ముందుగానే మెగా వారసురాలి పేరును రివీల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. మరి మెగా ప్రిన్సెస్ పేరు ఏంటో? దానికి అర్థం ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలి పేరును ప్రపంచానికి తెలియపరిచారు. ఎవరూ ఊహించని పేరును మెగా ప్రిన్సెస్ కు పెట్టారు. ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నట్లు మెగాస్టార్ తెలిపారు. ఇంతకీ మెగా ప్రిన్సెస్ పేరు ఏంటో తెలుసా? ‘క్లిన్ కార కొణిదెల’ అవును మీరు విన్నది.. చదివింది నిజమే. చిరంజీవి మనవరాలి పేరు ‘క్లిన్ కార కొణిదెల’. స్వయంగా చిరంజీవి తన ట్వీట్టర్ ద్వారా ఈ పేరును వెల్లడించారు. దాంతో మెగా అభిమానులందరు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఈ పేరుకు మీనింగ్ తెలుసుకునే పనిలో పడ్డారు మెగా ఫ్యాన్స్. క్లిన్ కారకు అర్ధం ఏంటంటే? మనలోని ఆధ్యాత్మిక శక్తిని మేల్కోలిపి, మనిషి మనసుని శుధ్ది చేసే శక్తి అన్న మాట. ఇక లిటిల్ మెగా ప్రిన్సెస్ తన వ్యక్తిత్వంలో పై లక్షణాలను ఇమడ్చుకుని, మనందరిని మంత్ర ముగ్దులను చేస్తుందని నమ్ముతున్నాను అంటూ మెగాస్టార్ రాసుకొచ్చారు.