సంక్షేమ పథకాలతో చిందులను ఆదుకోవాలి
జడ్పి చైర్మన్ కు నాయకుల వినతి
మంథని, జూన్ 30(కలం శ్రీ న్యూస్):రాజకీయంగా,ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన చిందు కులాలను ఆదుకునే బాద్యతను ప్రభుత్వం చేపట్టాలని తెలంగాణ చిందు హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం మారుతి కోరారు. శుక్రవారం మంథని పట్టణంలోని రాజాగృహ లో పెద్దపల్లి జిల్లా జడ్పి చైర్మను పుట్ట మధును మర్యాదపుర్వకంగా కలిసిన సభ్యులు ఆయనకు పలు డిమాండ్లతో కూడిన లేకను అందించారు.అనంతరం మారుతి మాట్లాడుతూ,చిందు కుల సంఘభవనానికి 500గజాల స్థలాన్ని కేటాయించాలని, దళితబందు,డబులు బెడ్ రూం ఇండ్లు,మూడు ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రతీపేద కుటుంబ ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల ఆర్థిక సహాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గడ్డం రవిందర్, గడ్డం చిన్న రవిందర్,గడ్డం నాగబూషణం,గడ్డం సాయిబాబ, గడ్డం శ్రీనివాస్,గడ్డం సంతోష్, గడ్డం శ్రీహరి,గడ్డం కనుకయ్య, గడ్డం లింగయ్య,గడ్డం ఎల్లయ్య, గడ్డం చంద్రయ్య,గడ్డం శివ,గడ్డం ప్రభాకర్, గడ్డం సమ్మయ్య,గడ్డం శంకర్,గడ్డం చిన్న లింగయ్య,గడ్డం లక్ష్మన్,గడ్డం వెంకట్ తదితరులు పాల్గొన్నారు.