జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడు: జూలపల్లి జెడ్పీటీసీ బోద్ధుల లక్ష్మణ్
కలం శ్రీ న్యూస్ డిజిటల్ పత్రికను ఆవిష్కరించిన బోద్ధుల
సుల్తానాబాద్,జూన్29(కలం శ్రీ న్యూస్):జర్నలిస్ట్ అంటే అక్షరాలను తూటాల్లా చేసుకుని, అవినీతి లొసుగులను బయటకు లాగే వేటగాడు అని కేసీఆర్ సేవా దళం అధ్యక్షుడు, జూలపల్లి జెడ్పీటీసీ బోద్ధుల లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పెద్దపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సుంక శ్రీధర్ స్థాపించిన కలం శ్రీ న్యూస్ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానెల్ లోగో ఆవిష్కరణ గురువారం సుల్తానాబాద్ లోని సుంక శ్రీధర్ నివాసం లో కేసీఆర్ సేవా దళం అధ్యక్షుడు, జూలపల్లి జెడ్పీటీసీ బోద్ధుల లక్ష్మణ్ ఆవిష్కరించారు.అనంతరం బోద్ధుల లక్ష్మణ్ మాట్లాడుతూ..సుంక శ్రీధర్ గత 11 సంవత్సర కాలంలో వివిధ పత్రికలలో,ఛానెల్ లో పనిచేసిన అనుభవం తో గత ఆరు నెలల క్రితం కలం శ్రీ న్యూస్ అనే వెబ్ సైట్ పత్రిక ప్రారంభించిన అతి తక్కువ సమయంలో గూగుల్ సంస్థ నుండి యాడ్ సెన్స్ అప్రూవల్ రావడం చాలా అభినందనీయం. ఈ క్రమంలో సుంక శ్రీధర్ మరో అడుగు ముందుకు వేసి ఈ పేపర్,డిజిటల్ పేపర్, యూ ట్యూబ్ చానెల్ ను స్థాపించి దాని ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడం నాకెంతో సంతోషంగా ఉందని, ముందు ముందు కలం శ్రీ న్యూస్ పత్రిక ద్వారా సుంక శ్రీధర్ ప్రజా సమస్యలను వెలికి తీసి ముందుకు పోవాలని కోరారు.
అనంతరం సుంక శ్రీధర్ మాట్లాడుతూ 11 సంవత్సర కాలంలో వివిధ పత్రికలలో,ఛానెల్ లో పనిచేసిన నేను మా బావ దూస మల్లిఖార్జున్ సలహా మేరకు గత ఆరు నెలల క్రితం కలం శ్రీ న్యూస్ అనే వెబ్ సైట్ పత్రిక ప్రారంభం చేయడం జరిగిందని, ప్రారంభించిన ఆరు నెలల లోపే గూగుల్ నుండి యాడ్ సెన్స్ అప్రూవల్ రావడం వలన నేడు కలం శ్రీ న్యూస్ అనే డిజిటల్ పేపర్, యూ ట్యూబ్ చానెల్ ప్రారంభం చేయడం జరిగిందని, దీనికి సహకరించిన తోటి పత్రిక మిత్రులకు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అని అన్నారు.ఈ కార్యక్రమంలో కలం శ్రీ న్యూస్ పత్రిక ఎడిటర్ సుంక శరణ్ చంద్ర, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్,జిల్లా ఉపాధ్యక్షుడు బోయిని వినోద్,మండల ప్రధాన కార్యదర్శి నూక రాందాసు,రిపోర్టర్ లు గోపి, పరమేశ్వర్,జూలపల్లి ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.