ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 29(కలం శ్రీ న్యూస్):మంథని వాసుమతి రెనె హాస్పిటల్ బంగారూ స్వామి నేతృత్యంలో మంథని గోదావరి తీరంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది.ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి మందులను పంపిణీ చేసారు.బీపీ,షుగర్ పరీక్షలు ఉచితంగా చేశారు.ఈ శిబిరంలో వైద్యులు ఎంబీబీస్ డాక్టర్ మునిరుద్దీన్ పాషా వైద్య సేవలు అందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మంథని సిఐ సతీష్, ఎస్సై వెంకటేశ్వర్లు, ,గౌతమేశ్వర ఆలయ చైర్మన్ మేడగొని రాజమౌళి గౌడ్, కమిటి మెంబర్లు, ఆర్య వైశ్య సంఘం సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.