భక్తి శ్రద్దలతో బక్రీద్ వేడుకలు
వెల్గటూర్ రిపోర్టర్/ పోడేటి శ్రీకాంత్
వెల్గటూర్,జూన్29(కలం శ్రీ న్యూస్):త్యాగానికీ మానవసేవకు ప్రతీకైన బక్రీద్ (ఈద్-ఉల్-అదా) పండుగ పర్వదినం సందర్బంగా ముస్లీం సోదరులు ఈద్గాల వద్ద ఘనంగా సాముహిక నమాజ్ నిర్వహించడం జరిగింది. ఉమ్మడి వెల్గటూర్ మండలంలోని శాఖపూర్, గుల్లకోట, జగదేవ్ పేట, అంబారిపేట, గొడిషేలపేట, పాతగుడూర్ గ్రామాలలోని ఈద్గాల వద్ద ఇమామ్ చే దివ్య ఖురాన్ గ్రంధంను పఠనం చేయించి, మహ్మద్ ప్రవక్త బోధనాలే ఆదర్శంగా సర్వలోక శాంతి చేకురేలా సన్మార్గంలో జీవనం కొనసాగాలని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుని, ఖుర్భానీ పంచి వేడుకలు జరుపుకున్నట్లు మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వెల్గటూర్ మండల ముస్లిం సోదరులు పాల్గొన్నారు.