భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం
జగిత్యాల,జూన్29(కలం శ్రీ న్యూస్):బహుజన నేత, భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ పై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లో జరిగిన కాల్పులు ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని భీం ఆర్మీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కుశ్నపల్లి ప్రేమ్ సాగర్ తెలిపారు. బహుజనుల హక్కు కోసం, బహుజనులకు రాజ్యాధికారం దక్కేలా కృషి చేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ పై కాల్పులు జరిపి హత్య చేయాలనుకోవడం దుర్మార్గపు చర్య గా అభివర్ణించారు.స్యాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన దళితులపై దాడులు ఆగడం లేదన్నారు.బుల్లెట్ గాయాలతో బయటపడిన ఆజాద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.కాల్పులకు పాల్పడిన దుండగులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.