Friday, September 20, 2024
Homeతెలంగాణనిరుపేద విద్యార్థులకు అండగా సహాయ ఫౌండేషన్

నిరుపేద విద్యార్థులకు అండగా సహాయ ఫౌండేషన్

నిరుపేద విద్యార్థులకు అండగా సహాయ ఫౌండేషన్

గజ్వేల్,జూన్28(కలం శ్రీ న్యూస్): గజ్వేల్ లో నిరుపేద విద్యార్థులకు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగ్స్ పెన్సిల్స్ నోట్ బుక్స్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సహాయ ఫౌండేషన్ చైర్మన్ మహమ్మద్ సమీర్ మాట్లాడుతూ సహాయ ఫౌండేషన్ స్థాపించి 13 సంవత్సరాలు పూర్తయిందని, ఈ 13 సంవత్సరాల్లో నిరుపేదలకు నిత్యావసరాలు అలాగే నిరుపేదల పెళ్లిళ్లకు సహాయం చేస్తూ, ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా సహాయం చేయాలని ఉద్దేశంతో నోట్ బుక్స్, బ్యాగ్స్ వాళ్లకు కావాల్సిన ఇతర సామాగ్రిని ఈరోజు ప్రైమరీ స్కూల్ ఎస్సీ కాలనీ, అలాగే ఎంపీపీ ఎస్ గిరిజన పాఠశాల లో కూడా మొత్తం 100 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందనీ తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన గోపాల్ చౌదరి కి కృతజ్ఞతలు తెలుపుతూ మునుముందు కూడా సహాయ ఫౌండేషన్ కు ఇలాగే అండగా నిలవాలని, మున్ముందు సహాయ ఫౌండేషన్ చేయబోయే కార్యక్రమాలకు అందరూ సభ్యులు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరారు .అలాగే ప్రాంతంతో సంబంధం లేకుండా ఎక్కడైనా సరే నిరుపేద విద్యార్థులు ఎవరికైనా నోట్ బుక్స్ గాని, బాగ్స్ గాని అవసరం ఉంటే తప్పకుండా మేము సహాయం చేస్తామని, సహాయం కోసం 834 099 90 99 కు కాల్ చేయగలరనీ కోరారు. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాద్, బాబూలాల్ చౌదరి, వీరాజ్ చౌదరి, కౌన్సిలర్ చందు,బాబా గౌడ్, గుల్లపల్లి ప్రవీణ్,గణేష్ గౌడ్,,అనిల్ గౌడ్ ,డీఎక్స్ మహేష్,సమీర్,జావీద్,సురజ్ దీపక్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!